ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'ఆత్మీయ పలకరింపు' - రోడ్లేయమని అడిగితే కారెక్కి వెళ్లిపోయిన మంత్రి ఉషశ్రీ - మంత్రి ఉష శ్రీ కి నిరసన సెగ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2024, 4:41 PM IST

Minister Usha Sri Charan: రాష్ట్ర మంత్రులకు ప్రజల నుంచి నిరసన సెగ తప్పడం లేదు. వారి సమస్యలపై మంత్రులను ప్రజలు, అధికార పార్టీ నేతలు సైతం నిలదీస్తున్నారు. కనీసం రోడ్ల వసతి కూడా లేదని రోడ్లు నిర్మించాలని అడిగితే మంత్రి ఉష శ్రీ కారెక్కి వెళ్లిపోయారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో ఆత్మీయ పలకరింపులకు వెళ్లిన మంత్రి ఉష శ్రీ చరణ్ కు నిరసన సెగ ఎదురైంది. ఎర్రమంచి, మోటివారిపల్లి గ్రామాలను ఆత్మీయ పలకరింపులో భాగంగా మంత్రి సందర్శించారు. 

తాగునీటి సమస్య పరిష్కరించి, రోడ్డు నిర్మాణం చేయించాలని స్థానికులు మంత్రిని కోరగా, ఆమె సరైన సమాధానం ఇవ్వకుండా కారులో వెనుదిరిగారు. దీంతో మంత్రి తీరు పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి మేలు చేయని పాలకులు గ్రామంలోకి రాకూడదని వారు నినాదించారు. గ్రామంలో 90 శాతం వైఎస్సార్​సీపీ ఓటర్లు ఉన్నా రోడ్డు సౌకర్యం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి నాయకులు సహకరించకుంటే, రాబేయే ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్థులు తేల్చి చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details