మీకు మీరే మంచివారని సర్టిఫికెట్లా ? - కేటీఆర్‌కు మంత్రి సత్యకుమార్ కౌంటర్ - Minister Satya Kumar Fires on KTR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 10, 2024, 2:26 PM IST
Minister Satya Kumar Fires on KTR : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. ఏపీలో జగన్, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎందుకు ఓడిపోయారో తెలియటం లేదని ఆయన మాట్లాడిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మంచివారని మీకు మీరే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. ధర్మవరంలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో సత్యకుమార్ పాల్గొని మాట్లాడారు.
Satya Kumar Counter to KTR : తెలంగాణలో నివాసం ఉంటున్న మాజీ మంత్రి కేటీఆర్, ధర్మవరంలో ఎవరికైనా ఫోన్ చేసి అడిగితే ఇక్కడి పరిస్థితి తెలిసేదని సత్యకుమార్ అన్నారు. వారే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎందుకు ఓడిపోయారో చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ను, ఏపీలో వైఎస్సార్సీపీని ప్రజలు ఇంటికి సాగనంపారని తెలిపారు. ప్రజా వ్యతిరేకపాలన చేసిన తమకు తగిన గుణపాఠం చెప్పారని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.
ఒకరికొకరు మంచి వారని సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారని సత్యకుమార్ అన్నారు. ఇక ఐదేళ్లు వారు ఓదార్పులు చేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌పై నాలుగేళ్ల క్రితం తాను మాట్లాడితే, తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా బ్లాక్ చేశారని చెప్పారు. రాజకీయ విమర్శలను కూడా ఆయన జీర్ణించుకోలేదని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.