ఓడిపోయినా పర్వాలేదు - మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు - Dharmana Sensational Comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 15, 2024, 3:36 PM IST
Minister Dharmana Prasada Rao Interesting Comments on Elections : ఎన్నికల్లో తాను ఓడిపోయినా పర్వాలేదంటూ మంత్రి ధర్మాన ప్రసాద రావు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. గురువారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన కళింగ వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. జిల్లా, నగర కళింగ వైశ్య సంఘ నాయకులు వైఎస్సార్సీపీని (YSRCP) గెలిపించాలని అనుకోవడం సంతోషమన్నారు. మీ నుంచి నాకు మద్దతు లభించదని గతంలో అనుకున్నాను. ఇన్నాళ్లూ ఎన్నికల్లో (Elections) గెలుస్తానో లేదో అనే ఆవేదనతో ఉండేవాడిని కానీ రోజులు గడిచేకొద్దీ గెలుస్తాననే నమ్మకం పెరుగుతోంది. మీ ఆదరణ చాలు ఇక 'నేను ఓడిపోయినా పర్వాలేదు’ అని అన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasada rao) చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. జగన్ వైనాట్ 175 అంటూ గొప్పలకు పోతుంటే, పార్టీ నేత ఓడిపోయినా ఫర్వాలేదు అన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి.