ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మాదిగ సంక్షేమాన్ని గాలికొదిలేసిన జగన్​- ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్తాం- మాదిగ మందకృష్ణ - Manda Krishna Fired on Jagan Gov

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 1:47 PM IST

Manda Krishna Fired on Jagan Government: మాదిగల విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్డుగా ఉందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మాదిగ మందకృష్ణ పేర్కొన్నారు. మాదిగల సంక్షేమం పట్ల అధికార ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మందకృష్ణ మండిపడ్డారు. ఇటీవల ప్రకటించిన ఎస్సీ పార్లమెంటు, అసెంబ్లీ  స్థానాల్లో కూడా మాదిగలకు ప్రాధాన్యత లేదని, మాదిగల సంక్షేమాన్ని పూర్తిగా వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం గాలికి వదిలేసిందని మందకృష్ణ మండిపడ్డారు. జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పేలా నిర్ణయం తీసుకుంటామని మందకృష్ణ పేర్కొన్నారు. 


మాదిగలకు మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఆ కార్పొరేషన్​లో డబ్బులు సున్నా అని మందకృష్ణ స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ మాదిగ కులాన్ని గుర్తించారని అందుకే ఎన్నికల్లో మోదీకే సపోర్ట్ చేస్తామని మందకృష్ణ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మాదిగ కులానికి కొంత న్యాయం జరిగిందని అందువల్ల రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజెేపీ కూటమికి (Alliance) సపోర్ట్ చేస్తామని మందకృష్ణ తెలిపారు.  చెప్పారు. త్వరలో టీడీపీ, జనసేన, బీజెేపీ పెద్దలతో కలిసి మాట్లాడతామని మందకృష్ణ చెప్పారు. 
 

ABOUT THE AUTHOR

...view details