మహిళను చంపి- రూ.60 వేలకు మేకలను అమ్మేశాడు - Man Killed Shepherdess for money - MAN KILLED SHEPHERDESS FOR MONEY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 22, 2024, 5:22 PM IST
Man Killed Shepherdess In Satya Sai District : డబ్బులకు ఆశపడి, దురాశతో ఓ మహిళ ప్రాణాలు తీశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం మలుగూరు గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా మేకలు మేపుతున్న జయమ్మ అనే మహిళను హరి అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత ఆమె కాస్తున్న మేకలు ఎత్తుకెళ్లాడు.
రోజూ ఒంటరిగా ఉంటున్న జయమ్మపై గత పది రోజులుగా నిఘా పెట్టాడు హరి. మాటలు కలుపుతూ పరిచయం ఏర్పరుచుకున్నాడు. అదను చూసి ఆవిడను చంపి మేకలు అమ్ముకుని సొమ్ము చేసుకుందామనుకున్నాడు. అనుకున్నట్టుగానే చేశాడు. పథకం ప్రకారం మహిళ గొంతుకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం మేకలను బులెరాలో ఎక్కించుకుని వెళ్లాడు. వాటిని రూ. 60 వేలకు అమ్మేశాడు. జయమ్మ కనిపించకపోవడంతో అతని కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో హరి ఉదంతం వెలుగు చూసింది. నింధితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.