ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గుంటూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య - వివాహేతర సంబంధమా ? పాత కక్షలా ? - గుంటూరు జిల్లాలో వ్యక్తి హత్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 3:13 PM IST

Man Brutally Murdered in Guntur District : గుంటూరు జిల్లా కొల్లిపర్ల మండలం దావులూరు అడ్డ రోడ్డు వద్ద ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. తూములూరుకు చెందిన వాలాది సాంబశివ రావును గుర్తు తెలియని దుండగులు నరికి చంపేశారు. మృతుడు సాంబశివ రావును గుర్తించిన  స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ (Investigation) చేపట్టారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు.

Man Died by Murder in Guntur Andhra Pradesh : మృతుడి మెడ మీద నరకడం వలన చనిపోయినట్లుగా పోలీసులు (Police) భావిస్తున్నామని  తెలిపారు, సాంబశివరావుకు అదే గ్రామానికి చెందిన ఒక కుటుంబంతో గతంలో గొడవలు ఉన్నాయని వాటికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుందని దానివల్లే హత్య (Murder) జరిగిందా అని బంధువులు ఆరోపిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఆ కోణంలోనూ విచారణ జరుపుతామని, త్వరలోనే కేసును ఛేదిస్తామని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details