LIVE: రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు - ప్రత్యక్షప్రసారం - MAHASHIVRATRI CELEBRATIONS LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 26, 2025, 6:12 AM IST
|Updated : Feb 26, 2025, 12:16 PM IST
Mahashivratri Celebrations across the Atate Live: మహాశివరాత్రికి రాష్ట్రంలోని శైవక్షేత్రాలు సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ దీప కాంతులతో శివాలయాలు వెలుగులీనుతున్నాయి. పరమేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రముఖ శైవక్షేత్రాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఇతర వేడుకలు కన్నులపండువగా సాగుతున్నాయి. శ్రీశైలం మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడోరోజు భ్రమరాంబ మల్లికార్జున స్వామి గజవాహనంపై కొలువుదిరి పూజలు అందుకున్నారు. మంగళ వాయిద్యాలు, కళాకారుల సందడి మధ్య స్వామి అమ్మవార్లకు శ్రీగిరి పురవీధుల్లో నేత్ర శోభితంగా గ్రామోత్సవం జరిగింది. శివరాత్రికి ఆలయానికి తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. పాగాలంకరణ, స్వామి అమ్మవార్ల కళ్యాణాలకు సర్వం సిద్ధం చేశామని ఎక్కువ మంది శివ స్వాములకు ఈ కార్యక్రమాలు తిలకించే అవకాశం కల్పించామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ప్రత్యక్షప్రసారం.
Last Updated : Feb 26, 2025, 12:16 PM IST