డీజిల్ రేట్లు జీఎస్టీ పరిధిలోకి తీసుకురండి : లారీ అసోసియేషన్ ప్రతినిధులు - Lorry Unions met Transport Minister - LORRY UNIONS MET TRANSPORT MINISTER
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 20, 2024, 10:25 AM IST
Lorry Unions Meet Transport Minister Mandipalli Ram Prasad : పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని న్యూ ఆంధ్రా మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్‌ను కోరారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మంత్రిని కలిసిన లారీ యజమానుల సంఘం ప్రతినిధులు తమ సమస్యలను పరిష్కరించాలని లేఖ అందించారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైనా పర్మిట్లు జారీ చేయలేదని, దీనివల్ల లారీ యజమానులు కష్టాలు పడుతున్నట్లు మంత్రి దృష్టికి తెచ్చారు. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో డీజిల్ రేట్లు పెంచడం వల్ల నష్టాల పాలైనట్లు తెలిపిన లారీ యజమానులు డీజిల్ రేట్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని కోరారు. రోడ్డు పన్ను ఒకే దేశం, ఒకే పన్ను విధానం అమలు చేయాలని కోరారు. దీనితో పాటు ఒకే దేశం ఒకే అపరాధ రుసుం అనే విధానం అమల్లోకి తేవాలని కోరారు. లారీ యజమానులపై ఆర్టీఓ అధికారుల వేధింపులు ఆపేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.