గ్యాస్ గోడౌన్ సమీపంలో డీజిల్ ట్యాంకర్‌లో మంటలు - అసలు ఏం జరిగిందంటే? - lorry Fire accident
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 16, 2024, 8:20 PM IST
Lorry Fire Accident in YSR District : వైఎస్సార్ జిల్లాలో ఓ లారీలో మంటలు చెలరేగడం స్థానికంగా కలకలం రేపింది. సిద్ధవటం మండలం మాధవరం గ్రామ శివార్లలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముద్దనూరు నుంచి చెన్నైకి లారీ ఇసుక లోడుతో వెళ్తోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో లారీ డ్రైవర్ అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో డ్రైవర్ లారీని మాధవరం వద్ద రహదారి పక్కన ఆపి తాను దిగిపోయాడు.
కొంతసేపటికే మంటలు లారీ మొత్తం వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమీపంలోనే గ్యాస్ గోదాం ఉండటంతో స్థానికులు ఎవరు వెళ్లడానికి సాహించలేదు. ఈ క్రమంలోనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం వల్ల కడప-చెన్నై జాతీయ రహదారిపై భారీగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకుని సిద్ధవటం ఎస్ఐ, ఒంటిమిట్ట సీఐ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరగడానికి కారణాలను డ్రైవర్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.