ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్​సీపీ పాలనతో ఏపీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది: జేపీ - JP ON AP FINANCIAL SITUATION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2024, 6:50 PM IST

Jayaprakash Narayana on AP Financial Situation: వైఎస్సార్​సీపీ ఐదేళ్ల దుష్ట పాలనతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర పన్నులు, కేంద్రం ఇచ్చే వాటాలో కలిపితే 3 వంతుల డబ్బు వడ్డీలకే సరిపోతుందని అన్నారు. సంపద సృష్టిని పట్టించుకోకుండా, బటన్ నొక్కడమే గొప్ప అన్నట్లు వ్యహరించడమే ఈ దుస్థితికి కారణమని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి సీఎం చంద్రబాబు కృషి చేయాలని సూచించారు. అప్పుల భారం 20 శాతం ఉండాల్సి ఉండగా రాష్ట్రంలో ఏకంగా 68 శాతానికి వెళ్లిందన్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేనంత నిర్లక్ష్యంగా పాలన చేసిందని ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా గాలికి వదిలేశారని జేపీ అన్నారు. చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు అపార నమ్మకం ఉందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే సామర్థ్యం ఆయనకే ఉందన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యాప్రమాణాలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లల్లో విద్యా ప్రమాణాలు, నైపుణ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని జేపీ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details