వరద బాధితులకు అండగా నిహారిక- 10 గ్రామాలకు ఆర్థిక సాయం - Konidela Niharika Donation - KONIDELA NIHARIKA DONATION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2024, 9:03 AM IST
Konidela Niharika Donation to Help Flood Victims in Vijayawada : వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ నటుడు కొణిదెల నాగబాబు కుమార్తె, నటి, నిర్మాత నిహారిక తన వంతు బాధ్యతగా ముందుకొచ్చారు. బుడమేరు ముంపుతో ప్రజలు ఇబ్బందులు పడటం తనను తీవ్రంగా కలిచివేసిందని నిహారిక ఆవేదన వ్యక్తం చేశారు. 10 గ్రామాలకు తన వంతు సహాయం అందిస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఒక్కో గ్రామానికి రూ.50 వేల చొప్పున రూ. 5 లక్షలను విరాళంగా ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా సురక్షితంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని నిహారిక వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే వరద బాధితుల సహాయార్థం మెగా కుటుంబం నుంచి రూ. 9.45 కోట్లను విరాళాన్ని ప్రకటించింది. తాజాగా నిహారిక తన వ్యక్తిగతంగా రూ. 5 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. వరద బాధితుల సహాయార్థం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇప్పటికే చాలా మంది తమ వంతు సాయం అందించారు.