ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బోగస్‌ ఓట్లతో ఎన్నికల్లో వైసీపీ గెలించేందుకు కుట్రలు చేస్తోంది: కొణతల రామకృష్ణ - stolen votes konathala complaint EC - STOLEN VOTES KONATHALA COMPLAINT EC

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 9:57 AM IST

Konathala Complaint EC to Remove Stolen Votes: బోగస్‌ ఓట్లతో అధికారంలోకి రావడం సీఎం జగన్​కు అలవాటని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లతో గెలుపొందిన చరిత్ర వైసీపీదని అన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో గుర్తించిన దొంగ ఓట్లను తొలగించాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో 4,828 డబుల్‌ ఓట్లు ఉన్నాయని ఈసీకి లేఖ రాశారు. ఒకే ఇంటి నంబరుతో 5,828 ఓట్లు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోగస్ ఓట్లను గుర్తించి వాటిని వెంటనే తొలగించాలని రామకృష్ణ పేర్కొన్నారు. 

వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను పార్టీ ప్రక్రియగా మార్చిందన్నారు. గత 35 సంవత్సరాలలో ఎన్నో ఎన్నికలు చూశామని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో గతంలో 18 వేలకు పైగా బోగస్‌ ఓట్లు గుర్తించి వాటిని తొలగించడంలో టీడీపీ విజయవంతంగా కృషి చేసిందని పేర్కొన్నారు. బోగస్‌ ఓట్లపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వైసీపీ కండువా కప్పుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్‌ కొమ్ముకాస్తున్నారని ఆయన మండిపడ్డారు. బోగస్ ఓట్లపై సమగ్ర పరిశీలన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details