రామోజీరావు మృతి తమను తీవ్రంగా కలచివేసింది- కోనసీమ ప్రజలు - Konaseema People Tribute to Ramoji Rao - KONASEEMA PEOPLE TRIBUTE TO RAMOJI RAO
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 8, 2024, 5:45 PM IST
Konaseema District People Tribute to Ramoji Rao Demise: పత్రికా రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన రామోజీరావు మృతి పట్ల కోనసీమ వాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 1996 నవంబర్ 6వ తేదీన కోనసీమకు పెన్ను తుఫాను వచ్చింది. ఆ సమయంలో వందల సంఖ్యలో నివాసగృహాలు పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో రామోజీ ఫౌండేషన్ ముందుకు వచ్చి కోనసీమలో పలు ప్రభుత్వ పాఠశాలలకు భవనాలు నిర్మించి వాటికి సూర్య భవనాలుగా నామకరణం చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ముంజవరపు కొట్టు గ్రామంలో నిర్మించిన సూర్య భవనాన్ని 1997లో రామోజీరావు ఈ గ్రామానికి వచ్చి ప్రారంభించారు ఆయన మరణంతో ఈ గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణంతో తెలుగు మీడియా రంగం ఒక మహోన్నత వ్యక్తినీ కోల్పోయిందని అన్నారు. తెలుగు పాత్రికేయ రంగానికి, తెలుగు భాషాభివృద్ధికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవి గ్రామస్థులు కొనియాడారు.