ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ద్వారంపూడి దందాలతో ప్రజలు విసిగిపోయారు- కాకినాడను స్మార్ట్​ సిటీగా తీర్చిదిద్దుతాం: టీడీపీ నేత కొండబాబు - TDP Leader Kondababu Interview - TDP LEADER KONDABABU INTERVIEW

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 3:04 PM IST

Kakinada TDP Leader Kondababu Interview: ప్రశాంతమైన కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి భూ కబ్జాలు, దందాలు, దౌర్జన్యలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారని తెలుగుదేశం అభ్యర్థి కొండబాబు ఆరోపించారు. ప్రశాంతమైన కాకినాడను గంజాయి, డ్రగ్స్​కు అడ్డాగా మార్చేశారని మండిపడ్డారు. మడ అడవులు నరికేసి, భూములు కొట్టేసే ప్రయత్నాలు చేశారని గుర్తు చేస్తూ, పలు అంశాలు వైసీపీ అభ్యర్థి ద్వారంపూడికి ప్రతికూలంగా మారాయని ప్రజలు కూటమిని గెలిపించేందుకు సిద్ధమయ్యారని వనమాడి కొండబాబు అన్నారు. 

ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కాకినాడను ద్వారంపూడి సర్వనాశనం చేశారని కొండబాబు ఆరోపించారు. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అరాచకాలకు అడ్డులేకుండా పోయిందని విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారే స్వయంగా చెబుతున్నారంటే వైసీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుందని అన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాల కోసం తీసుకున్న భూములను కాజేసే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక కాకినాడను స్మార్ట్‌ సిటీగా మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థిగా తన గెలుపు తథ్యమని కొండబాబు ధీమా వ్యక్తం చేశారు. వనమాడి కొండబాబుతో మా ప్రతినిధి సాయికృష్ణ నిర్వహించిన ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details