పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి - టోల్ ప్లాజా మట్టడి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 23, 2024, 5:02 PM IST
JC Prabhakar Reddy and Farmers Protest at Gutti Toll Plaza: పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ అనంతపురం జిల్లా గుత్తిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. పత్తి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై గుత్తి టోల్ ప్లాజా వద్ద రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పత్తి రైతులను ప్రభుత్వం పట్టించుకోవటంలేదని ఆయన మండిపడ్డారు. దాదాపు రెండు సంవత్సరాలుగా రైతుల వద్ద పంట నిల్వ ఉండిపోయిందని తెలిపారు. ప్రస్తుతం వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. టోల్ ప్లాజా వద్ద ఆగిన వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సురేష్ వాహనాన్ని పత్తి రైతులు అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేషనల్ హైవేపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అనంతరం మార్కెట్ యార్డులో ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేశారు. రైతుల వద్ద రెండేళ్లుగా నిలిచిపోయిన పత్తి నిల్వలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.