LIVE: అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయ భేరి సభ - ప్రత్యక్ష ప్రసారం - varahi vijayabheri meeting - VARAHI VIJAYABHERI MEETING
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 7, 2024, 6:53 PM IST
|Updated : Apr 7, 2024, 7:46 PM IST
Pawan Kalyan Varahi Vijayabheri Meeting: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొలిసారి అనకాపల్లి జిల్లాకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారానికి చేరుకున్నారు. వారాహి యాత్రలో భాగంగా అనకాపల్లిలోని నెహ్రూచౌక్ కూడలిలో సేనాని బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. దీనికోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాల్లో కూటమి తరఫున జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అనకాపల్లిలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీ, బీజేపీ నేతలను కలుపుకొని కొన్ని రోజులుగా ప్రచారాన్ని చేపడుతున్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావుని వ్యక్తిగతంగా కలిసి మద్దతు కూడగట్టుకున్నారు. మొదట్లో టీడీపీ కార్యకర్తల నుంచి కొంత మిశ్రమ స్పందన వచ్చినా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రచారంలోకి దిగడంతో పార్టీ శ్రేణులంతా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అనకాపల్లికి చేరుకున్న పవన్ కల్యాణ్‌కు అనకాపల్లి, పెందుర్తి జనసేన అభ్యర్థులు స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనకాపల్లిలో వారాహి విజయ భేరి సభలో పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Apr 7, 2024, 7:46 PM IST