ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖ స్టీల్‌ ప్లాంట్​ను పరిరక్షించే బాధ్యత నాదే: పల్లా శ్రీనివాసరావు - TDP Leader Srinivasa Rao Interview - TDP LEADER SRINIVASA RAO INTERVIEW

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 12:21 PM IST

Interview With TDP State President Palla Srinivasa Rao: వైఎస్సార్సీపీ హయాంలో తెలుగుదేశం కార్యకర్తలపై కక్షపూరితంగా పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసేలా చర్యలు తీసుకుంటామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. ఈసారి పార్టీకి, ప్రభుత్వానికి మధ్య దూరం రాకుండా చూసుకుంటామని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రకు ప్రాధాన్యతలో భాగంగానే తనకు పదవి వచ్చిందని శ్రీనివాసరావు తెలిపారు. పార్టీకి, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. దాన్ని ఎలాగైనా పూర్తి చేసి రైతులకు అందజేయాలనే కృతనిశ్చయంతో సీఎం ఉన్నారని తెలిపారు. 

ప్రభుత్వంతో కార్యకర్తలు మమేకం అయ్యేలా చూస్తామన్నారు. కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేశారనే భావన రానివ్వమని పల్లా తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్​ను పరిరక్షించే బాధ్యత తనదే అని పల్లా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ దీక్ష సోమవారానికి 12 వందల 23వ రోజుకు చేరుకొవటంతో పల్లా శ్రీనివాసరావు శిబిరాన్ని సందర్శించారు. స్టీల్​ ప్లాంట్​ను ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తానని ఆయన భరోసానిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details