యడం బాలాజికి సహకరించం - తేల్చి చెప్పిన పర్చూరు వైసీపీ నేతలు - YCP LEADERS AGAINST YADAM BALAJI - YCP LEADERS AGAINST YADAM BALAJI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 30, 2024, 6:48 PM IST
Internal Clashes Between YCP Leaders in Bapatla District : బాపట్ల జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని పర్చూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి యడం బాలాజికి తాము సహకరించబోమని వైసీపీ నాయకులు తెల్చి చెప్పారు. నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు పట్ల యడం బాలాజి అనుచితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అలాగే ముఖ్య నేతలు, కార్యకర్తలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వ్యక్తిగతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సైతం కనీస సమాచారం ఇవ్వటం లేదని స్థానిక నాయకులు వాపోయారు.
ఈ సందర్భంగా కారంచేడు వైసీపీ ఎంపీపీ వాసుబాబు మాట్లాడుతూ, వైసీపీ పార్టీ ఆవిర్భవం నుంచి తము పార్టీలో కొనసాగుతున్నాము. పార్టీలో గౌరవంగా ఉంటున్న మమ్మల్ని యడం బాలాజి తీవ్రంగా అవమానిస్తున్నారు. అదేమని అడిగితే మమ్మల్నే దూషించి మీరు పార్టీలో ఉంటే ఉండండి, లేదంటే బయటకు వెళ్లండి అని చిందులేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోవాల్సింది పోయి నాయకుల్ని దుర్భాషలాటం, దూరం పెట్టడం లాంటివి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనుంచి తము యడం బాలాజికి సహకరించబోమని స్పష్టం చేశారు. దీనిపై వైసీపీ అధిష్టానంకి ఫిర్యాదు చేస్తామని వాసుబాబు తెలిపారు.