రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం - దక్షిణ కోస్తాలో రికార్డు స్థాయిలో వర్షాలు - AP Weather Updates 2024 - AP WEATHER UPDATES 2024
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2024, 9:37 AM IST
AP Weather Updates 2024 : వాయుగుండం అర్ధరాత్రి కళింగపట్నం దగ్గర తీరం దాటినా రాష్ట్రం మీద ప్రభావం చూపిస్తోంది. ప్రసుత్తం తీరం దాటిన వాయుగుండం జగదల్‌పూర్‌కు ఆగ్నేయంగా 60 కిలోమీటర్లు, విశాఖకు వాయువ్యంగా 120 కి.మీ దూరంలో ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా దక్షిణ ఒడిశా- విదర్భ చేరుకుని బలహీనపడుతుందని వివరించింది. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు ప్రకటించింది.
Heavy Rains in AP : ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వివరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో అమరావతిలో 26 సెం.మీ, తిరువూరులో 25, గుంటూరులో 23, తెనాలిలో 18, మంగళగిరిలో 17, విజయవాడలో 17.5 సెం.మీ చొప్పున అత్యధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. దక్షిణ కోస్తాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్న వాతావరణ శాఖ అధికారి కేవీఎస్ శ్రీనివాస్‌తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యేక ముఖాముఖి.