ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రేపు అర్ధరాత్రి జాగ్రత్త - తీరం దిశగా దూసుకొస్తున్న 'దానా'- ఉత్తర కోస్తాకు ఎల్లో అలర్ట్

By ETV Bharat Andhra Pradesh Team

Published : 12 hours ago

IMD issues yellow alert for north coastal Andhra Pradesh as cyclonic storm Dana Approaches : బంగాళాఖాతంలో ‘దానా' తుపాను వేగంగా తీరం వైపునకు దూసుకొస్తోంది. ఇది మరింత బలపడి రేపటికి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.  పూరీ (ఒడిశా), సాగర ద్వీపం (పశ్చిమబెంగాల్‌) మధ్య భితార్కానికా, ధమ్రా సమీపంలో తీరం దాటనున్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. గడిచిన 6 గంటల్లో తుపాను గంటకు 15 కి.మీ వేగంతో ముందుకు కదులుతోందని తెలిపింది. ప్రస్తుతం పరదీప్‌ (ఒడిశా)కి  520 కి.మీ., సాగర్ ద్వీపానికి 600 కి.మీ, ఖేపుపరా (బంగ్లాదేశ్)కి 610 కి.మీ దూరంలో దానా తుపాను కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది.

ఉత్తరాంధ్రలో ఈదురుగాలుల ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేటి నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి గంటకు 80-100కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. గురు, శుక్రవారాల్లో సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇది గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య  తీరం దాటుతుందంటున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారులతో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details