ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆగని ఇసుక అక్రమ తవ్వకాలు - రీచ్​ల నుంచి లారీలను బయటకు పంపిన టీడీపీ నేతలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 3:57 PM IST

 Illegal Sand Mining in Guntur District : ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించినా, రాష్ట్రంలో మాత్రం యథేచ్ఛగా తవ్వకాలు సాగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం బోరుపాలెంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతుండగా వాటిని ఆపాలని తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్​కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు బోరుపాలెం ఇసుక రేవులో ధర్నా నిర్వహించారు. ఎటువంటి అనుమతులు లేకుండా వందల కొద్ది లారీలలో అక్రమంగా ఇసుక తరలిపోతోందని నేతలు ఆరోపించారు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే చేతులెత్తేయడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని నేతలు మండిపడ్డారు. 

పోలీసులు వచ్చి సమాధానం చెప్పేంతవరకు రీచ్​ను వదిలిపోమని నేతలు తేల్చి చెప్పారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న టీడపీ నాయకులతో చర్చలు జరిపారు. ఇసుక తరలింపుపై అనుమతులు వచ్చాకే తవ్వకాలు చేపట్టాలని నేతలు స్పష్టం చేశారు. అనంతరం రీచ్​లలో ఉన్న లారీలలోని ఇసుకను ఖాళీ చేయించి వాటిని బయటకు పంపించేశారు. లారీలు మళ్లీ రీచ్ లోపలికి వస్తే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details