ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు - తొలగించిన అధికారులు - Illegal Constructions Removed - ILLEGAL CONSTRUCTIONS REMOVED

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 1:41 PM IST

Illegal Constructions Removed in Satya Sai District : సత్యసాయి జిల్లా కదిరి మండలం ముత్యాలచెరువు పంచాయతీలో ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. కదిరి - హిందూపురం ప్రధాన రహదారి సమీపంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిలో పునాదులు వేశారు. మరో రెండు భవనాలు నిర్మించారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన గ్రామ సచివాలయ సిబ్బంది అక్రమ నిర్మాణాలను పొక్లెయిన్లతో తొలగించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Land Grabbing In Kadiri : గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రతినిధులే వేల ఎకరాల ప్రభుత్వ భూములను దోచుకున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్సార్సీపీ సర్కారు చేసిన అక్రమాలను ఒక్కొక్కటిగా సరి చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఇసుక, గంజాయి అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. ఇదే తరహాలో భూ దోపిడీ చర్యలను అకరికట్టేందుకు చర్యలు చేపడతారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.    

ABOUT THE AUTHOR

...view details