టీడీపీ ఫర్ ఆంధ్రా వెబ్‌సైట్‌కు అనూహ్య స్పందన - Huge Response TDP for Andhra - HUGE RESPONSE TDP FOR ANDHRA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 12, 2024, 7:11 PM IST
Huge Response For TDP for Andhra Website : టీడీపీ ఫర్ ఆంధ్ర వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో విరాళాలు అందించాల్సిందిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. మూడు రోజుల క్రితం ఇందుకు సంబంధించిన వెబ్ సైట్‌ను చంద్రబాబు నాయుడు ప్రారంభించగా, ఇప్పటి వరకు 5వేల మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు విరాళాలు అందజేశారు. ప్రాణాలకు తెగించి అయినా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని తెలిపారు.
5 Lakhs People Donated Funds For Telugu desam Party : ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ స్థిరపడినా నా జన్మభూమి అనే భావనను మదినిండా నింపుకున్న తెలుగువారు తమ సంపాదనలో కొంతమొత్తాన్ని రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీకి విరాళంగా ఇవ్వాల్సిందిగా చంద్రబాబు పిలుపునిచ్చారు. విరాళాలు అందించేవారు టీడీపీ ఫర్ ఆంధ్ర.కామ్ వెబ్ సైట్లోకి వెళ్లి విరాళాలు అందజేయడం ద్వారా నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తోంది.