ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బావిలో భారీ కొండ చిలువ - బయటకు రాగానే స్థానికులు పరుగో పరుగు - Huge python in well - HUGE PYTHON IN WELL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2024, 7:48 PM IST

Huge Python in Well: ఓ భారీ కొండచిలువ బావిలో ప్రవేశించి బయటకు రాలేక ఇబ్బందులు పడింది. దీంతో కొండ చిలువను చూసిన ప్రజలు బెంబేలెత్తిపోయారు. అయితే ఏదో ఒకలా బావి నుంచి బయటకు తీయగా, బయటకు వచ్చిన వెంటనే కాసేపు స్థానికులను పరుగులు పెట్టించింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. అల్లూరి జిల్లా గంగవరం మండల కేంద్రంలో ఓ భారీ కొండచిలువ మంచినీటి బావిలో పడింది.

ఓ ఇంటిలోని బావి అంచుల నుంచి పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న కొండ చిలువను యజమానులు గుర్తించారు. భయభ్రాంతులకు గురైన వారు వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. ఓ యువకుడు ధైర్యం చేసి కర్రతో దాన్ని బయటకు తీసి సంచిలో వేసే ప్రయత్నం చేశాడు. ఇదే అదనుగా భావించిన కొండ చిలువ బయటకు తీయగానే పక్కనున్న పొదల్లోకి జారుకుంది. ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న వారంతా పరుగులు తీశారు. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.

ABOUT THE AUTHOR

...view details