మైనర్ బాలిక హత్య నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు- హోంమంత్రి - Anitha on Minor Girl Murder - ANITHA ON MINOR GIRL MURDER
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 7, 2024, 8:19 PM IST
Home Minister Anitha Reacted on Minor Girl Murder: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుశెట్టివారిపాలెంలో మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడిని పట్టుకొని తగిన శిక్ష పడేలా చూస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఇంట్లో ఉన్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన సురేష్ అనే 26 ఏళ్ల యువకుడు దారుణంగా హత్య చేసిన సంగతి విధితమే. నిందితుడు హత్య చేసిన అనంతరం పరారీ అయ్యాడని అతన్ని పట్టుకోడానికి 9 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు అనిత తెలిపారు. నిందితుడు గతంలో బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో ఫోక్స్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారని బెయిల్పై వచ్చిన నిందితుడు బాలికను అతికిరాతంగా హత్య చేశాడని అన్నారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని జిల్లా పోలీసులు ఆదేశించినట్లు మంత్రి అనిత తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తనను అడిగి వివరాలు తెలుసుకున్నట్లు అనిత వివరించారు. మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని అనిత వెల్లడించారు.