రాజ్‌తరుణ్ లావణ్య వ్యవహారంలో నాకేంటి సంబంధం : నటి మాల్వీ మల్హోత్రా - Actress Malvi Malhotra Reacts - ACTRESS MALVI MALHOTRA REACTS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 7, 2024, 5:17 PM IST
Actress Malvi Malhotra Reacts On Raj Tarun Lover Lavanya : సినీ నటుడు రాజ్‌తరుణ్ లావణ్య వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి మాల్వీ మల్హోత్రా స్పష్టం చేశారు. తన సోదరుడు లావణ్యను బెదిరించలేదని వెల్లడించారు. తన కుటుంబ సభ్యులకు లావణ్య ఎవరో కూడా తెలియదని, ఆమెను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. తమపైన లావణ్య నిరాధార ఆరోపణలు చేస్తుందని అన్నారు.
సైబరాబాద్‌లోని మహిళా పోలీస్ స్టేషన్లో లావణ్యపై ఫిర్యాదు చేశారు. తన కుటుంబం హిమాచల్‌ప్రదేశ్‌లో నివసిస్తోందని, ఒకసారి షూటింగ్ సందర్భంగా తన కుటుంబ సభ్యులను రాజ్‌తరుణ్ కలిశాడని ఆమె వెల్లడించారు. లావణ్య చేసిన ఆరోపణల్లో నిజంలేదని స్పష్టం చేశారు. రాజ్‌తరుణ్ తన సహనటుడు మాత్రమేనని, కలిసి పనిచేశామని చెప్పారు. తాము సినిమాల గురించి, షూటింగ్ గురించి మాత్రమే మాట్లాడుకునేవాళ్లమని తెలిపారు. లావణ్యే తన కుటుంబ సభ్యులను బెదిరిస్తోందని, ఆమె ఇలా ఎందుకు చేస్తోందో అర్థం కావడంలేదని మాల్వీ అన్నారు.