ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయవాడ బస్టాండ్​లోకి భారీగా వర్షపు నీరు - ప్రయాణికుల ఇబ్బందులు - Rain Water in Vijayawada Bus Stand

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2024, 3:56 PM IST

Heavy Rain Water in Vijayawada (ETV Bharat)

Heavy Rain Water in Vijayawada Pandit Nehru Bus Station : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విజయవాడలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నగరంలోని రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ బస్టాండ్ చుట్టూ వరద చేరింది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోకి మోకాళ్ల లోతు నీరు చేరడంతో బస్సులు, లారీలు రోడ్లపైనే నిలిచిపోయాయి. 

Rains in Vijayawada : నగరంలోని బెంజ్​సర్కిల్‌, నిర్మలా కాన్వెంట్‌, ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్​కు​ తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు సైతం ఇబ్బందలు పడుతున్నారు. వన్ టౌన్ పోలీస్​ స్టేషన్​, గురునానక్ కాలనీ, చుట్టుగుంట, కృష్ణలంక, రామలింగేశ్వరనగర్​లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షాలకు బస్టాండ్​లో ఉన్నవారు ఎటు వెళ్లలేక అక్కడే నిరీక్షిస్తున్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్‌ చుట్టు భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాలు సైతం వరదలో చిక్కుకున్నాయి. వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details