ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లిన కంటైనర్ - భారీగా చెలరేగిన మంటలు - container hit two wheeler - CONTAINER HIT TWO WHEELER

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 8:41 PM IST

Heavy Fire Broke Out When Container Hit Two Wheeler : నెల్లూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపైకి కంటైనర్ దూసుకెళ్లడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పూర్తిగా కాలి బూడిదైంది. అలాగే కంటైనర్​కు సైతం భారీగా మంటలు వ్యాపించాయి. వివరాల్లో వెళ్తే, జిల్లాలోని కావలి మండల పరిధిలో ఉన్న రుద్రకోట జాతీయ రహదారిపై డెలివరి కంపెనీకి చెందిన కంటైనర్ వెళ్తుంది. అదే రహదారిపై ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు కంటైనర్ ఒక్కసారిగా ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లింది. 

దీంతో ఆ ద్విచక్ర వాహనం పూర్తిగా కాలి బూడిదైంది. అలాగే సెగ కంటైనర్​కు వ్యాపించడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో రహదారిపై పెద్దఎత్తున పొగ వ్యాపించింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

ABOUT THE AUTHOR

...view details