ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

28 ఏళ్ల తరువాత శిరోముండనం కేసులో వీడిన ఉత్కంఠ - హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు - VENKATAYAPALEM HEAD TONSURE CASE - VENKATAYAPALEM HEAD TONSURE CASE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 8:18 PM IST

VENKATAYAPALEM HEAD TONSURE CASE Verdict : వెంకటాయపాలెం శిరోముండనం కేసులో నిందితులకు శిక్ష పడటం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమను వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు (YCP MLC Tota Trimurtulu) ఎంతో వేధించారని గతాన్ని తలుచుకుని ఆవేదన చెందారు. 28 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించిందని శిరోముండనం బాధితుడు గణపతి అన్నారు. ఈ తీర్పుతో న్యాయస్థానాలపై విశ్వాసం మరింత పెరిగిందని ఇది దళితుల విజయమని చెబుతున్నారు.

వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖ కోర్టు వెలువరించిన తీర్పుపై బాధితుడు గణపతి హర్షం వ్యక్తం చేశారు. 1996 డిసెంబర్​ 29న శిరోముండనం సంఘటన స్థలంలో తోట త్రిమూర్తులు ఉన్నారని గుర్తు చేశారు. 28 ఏళ్ల నిరీక్షణ తర్వాత దళితులకు న్యాయం జరిగిందని తెలిపారు. అయిదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ఇవాళ విశాఖ కోర్టు తీర్పుతో దళితలందరికి న్యాయం జరిగిందని బాధితుడు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details