గుడివాడలో కొడాలి నాని అనుచరుడి దాష్టికం - టీడీపీ మద్దతుదారునిపై దాడి - YCP leader attacked TDP leader - YCP LEADER ATTACKED TDP LEADER
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 8:29 AM IST
Gudivada YCP MLA Kodali Nani Follower Attacked TDP Leader : కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ నాయకుడు నిమ్మగడ్డ చిట్టిబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుడు కసుకుర్తి బాబ్జి దాడి చేశాడు. రాజేంద్రనగర్లోని గణేష్ పారడైజ్ అపార్ట్మెంట్లో జరిగిన ఓ సమావేశంలో మాట మాట పెరగడంతో చిట్టి బాబుపై బాబ్జి విచక్షణారహితంగా పిడుగుద్దులతో దాడి చేయగా ఆయన కన్ను వద్ద తీవ్ర గాయమైంది. గాయపడిన చిట్టిబాబును అపార్ట్మెంట్ వాసులు గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు.
తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నాననే అక్కసుతో బాబ్జి తనపై దాడి చేశాడని చిట్టిబాబు ఆరోపించారు. అపార్ట్మెంట్ సమావేశానికి రౌడీ మూకను రప్పించిన బాబ్జి, తమను భయభ్రాంతులకు గురి చేసేలా బెదిరింపులకు దిగారని చిట్టిబాబు అన్నారు. పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. గాయపడిన చిట్టిబాబును టీడీపీ నేతలు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.