రాష్ట్ర సైనిక సంక్షేమ బోర్డు మేనేజింగ్ కమిటీతో గవర్నర్ భేటీ - సైనిక సంక్షేమశాఖపై గవర్నర్ సమీక్ష
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 9:00 PM IST
Governor meeting with Managing Committee of the State Military Welfare Board : రాష్ట్రంలో సైనిక సంక్షేమశాఖ పనితీరుపై గవర్నర్ (Governor) జస్టిస్ అబ్దుల్ నజీర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడలోని రాజ్ భవన్ లో రాష్ట్ర సైనిక సంక్షేమ బోర్డు మేనేజింగ్ కమిటీతో భేటీ అయ్యారు. ఈ బోర్డు మీటింగ్లో సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ వి. వెంకటరెడ్డి సహా ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సైనిక సంక్షేమ శాఖ గత ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాల (Programmes) గురించి వివరించారు.
వాటితోపాటు ఉద్యోగ విరమణ చేసిన సైనికులు (Soldiers) , వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల గురించి తెలిపారు. వివిధ పథకాల కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు, గ్రాంట్లు పెంపునకు ప్రతిపాదించిన నిర్ణయాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని విధాల సౌకర్యవంతమైన పథకాలు అమలు చేస్తూ సైనికులకూ, వారు కుటుంబ సభ్యులకు అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.