తండ్రి ఆటో కిందపడి కొడుకు మృతి - పార్కింగ్ చేస్తుండగా ప్రమాదం - krishna district auto accident
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 6:43 PM IST
Four Years Child Died in an Auto Accident in Krishna District : తండ్రి ఆటో కిందపడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో వరిగంజి మురళీ కృష్ణ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మురళీ కృష్ణ ఆటో పార్క్ చేస్తున్న క్రమంలో రివర్స్ చేస్తుండగా, ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న బాలుడు రిషిక్ (4) ప్రమాదవ శాత్తు వాహనం వెనుక టైర్ కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు.
Seriously Injured Child was Taken to a Local Hospital : తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న తన కుమారుడ్ని(రిషిక్) హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి రిషిక్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. రిషిక్ మరణ వార్త విన్న తల్లిదండ్రులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటనతో మోటూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.