గుంటూరులో నిర్వహించే సభకు రావాలని అమరావతి రైతులకు కాంగ్రెస్ ఆహ్వానం - capital farmers
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 10:04 PM IST
JD Seelam met Amaravati farmers: రాజధాని రైతులు సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జేడీ శీలం, సుంకర పద్మశ్రీ తుళ్లూరులోని రాజధాని రైతు ఐకాస నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల7వ తేదీన గుంటూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే సభకు రాజధాని రైతులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరులో జరిగే సమావేశంలో రాజధానిపై కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ వెలువరించనుందని జేడీ శీలం రైతులకు తెలియజేశారు. అమరావతికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో, పార్టీ నిర్వహించే సభలో పాల్గొనాలని రైతులకు పిలుపునిచ్చారు. రైతులందరితో చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని జేజీ శీలం పేర్కొన్నారు. రైతులు అంతా తరలి వచ్చి కాంగ్రెస్ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటుగా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరు అవుతారని తెలిపారు.