ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

శ్రీనివాసుడిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ - వేద పండితుల ఆశీర్వచనం - tirumala visit news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 1:21 PM IST

Former Cricketer Krishnamachari Srikanth Visited Tirumala Srivari : తిరుమల శ్రీవారిని మాజీ క్రికెటర్​ కృష్ణమాచారి శ్రీకాంత్​ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అర్చన సేవలో సతీసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన మాజీ క్రికెటర్​కు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు స్వామి వారి దర్శనం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి వారి హుండీలో కానుకలను సమర్పించుకున్నారు. సతీసమేతంగా శ్రీవారి మొక్కులు చెల్లించుకున్నారు.

Former Cricketer Krishnamachari Srikanth was Warmly Welcomed by TTD officials : శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీకాంత్​కు వేద పండితుల ఆశీర్వచనం చేశారు. స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. కలియుగ వైకుంఠవాసుడిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పలువురు క్రికెట్​ అభిమానులు శ్రీకాంత్​తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు. తనపై అభిమానులు చూపుతున్న ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details