బావిలో దిగిన వ్యక్తికి అస్వస్థత - ప్రాణాలు కాపాడిన ఫైర్ రెస్క్యూ టీమ్ - Firemen Rescued Man Fell in Well - FIREMEN RESCUED MAN FELL IN WELL
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 20, 2024, 5:45 PM IST
Firemen Rescued Man Who Fell into the Well : ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం రామచంద్రపురంలో బావిలో దిగి ప్రమాదంలో పడిన చిలుకా రంగయ్య అనే వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. రంగయ్య ఇంటి వద్ద ఉన్నబావిలో చెత్త తొలగించేందుకు దిగగా ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వెంటనే స్పందించి ఘటనాస్థలానికి చేరుకుని బావిలో ఉన్న రంగయ్యను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.
ఇంటి వద్ద వున్న బావిలో మోటార్‌కు చెత్త అడ్డుగా ఉందని దాన్ని తొలిగిద్దామని రంగయ్య 50 అడుగుల బావిలోకి దిగాడు. పూర్తిగా లోపలికి వెళ్లాక ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటే అక్కడ వున్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి రంగయ్య ప్రాణాలు నిలబెట్టారు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.