ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చెరువులా పంట పొలాలు - చేతికొచ్చిన వరిపైరు కుళ్లిపోయిందని రైతుల ఆవేదన - Crops Damage Due to Floods - CROPS DAMAGE DUE TO FLOODS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 10:48 PM IST

Farmers Worried About their Paddy Crops Submerged in Floods: ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. వర్షాల వల్ల వరద నీరు పోటెత్తడంతో  పలు ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ముక్కపాడు గ్రామాన్ని బుడమేరు, వన్నేరు కాలువలు చుట్టుముట్టాయి. ఊరంతా నీరు చేరడంతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వరినాట్లు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే పొట్ట దశకు వస్తున్న వరి వరదలకు నీట మునిగి కుళ్లిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరానికి 25 వేల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. వరద ముంపుతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. సాగుకోసం తెచ్చిన రుణాలు రద్దు చేసి మళ్లీ పంటలు వేసుకునేందుకు ప్రభుత్వం సాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. 

ABOUT THE AUTHOR

...view details