ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన- మంత్రి గొట్టిపాటి ఆదేశాలతో క్షణాల్లో సమస్య పరిష్కారం - Minister Response to Farmer Problem - MINISTER RESPONSE TO FARMER PROBLEM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 4:59 PM IST

Updated : Jul 9, 2024, 8:35 PM IST

Minister Response to Farmer Problem: పొలంలో చేతికి అందే ఎత్తులో విద్యుత్తు తీగలు. ఆ పొలంలో విత్తనాలు వేసేందుకు రైతు అవస్థలు వర్ణణాతీతం. దుక్కి దున్నేది మొదలు విత్తనాలు వేసేంత వరకు పొలంలో వేలాడుతున్న విద్యుత్ తీగలను ప్లాస్టిక్ పైపుల సాయంతో పైకి పట్టుకుని పనులు చేసుకున్నారు. ఇది గమనించిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వీడియో వైరల్​గా మారింది. ప్లాస్టిక్ పైపుల సాయంతో విద్యుత్ తీగలను పట్టుకుని వ్యవసాయం చేస్తున్న రైతు అంటూ పోస్టు చేయటంతో వైరల్ అయ్యింది. ఇదే విషయంపై ఈటీవీ భారత్​లో కథనం రావడంతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి స్పందించారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని ట్రాన్స్​కో అధికారులను ఆదేశించారు. నేరుగా మంత్రి రంగంలోని దిగడంతో యుద్ధ ప్రాతిపదికన గంగయ్య పొలంలో స్తంభం ఏర్పాటు చేసి సమస్యను అధికారులు పరిష్కరించారు.

Farmers Facing Problems With Electrical Wires : వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం నాగసానిపల్లెకు చెందిన తుమ్మ గంగయ్య అనే రైతు గత మూడు సంవత్సరాలుగా తన పొలంలో విద్యుత్ తీగలతో ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకోని వ్యవసాయ పనులు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలు మార్లు విద్యుత్ తీగల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ఆ రైతు వాపోయారు. ఇప్పటికైనా విద్యుత్తు అధికారులు స్పందించాలని కోరారు. రైతు సమస్య గొట్టిపాటి రవి దృష్టికి వెళ్లడంతో అధికారులు సమస్యను పరిష్కరించారు. దీంతో మంత్రి గొట్టిపాటికి రైతు కృతజ్ఞతలు తెలిపారు. 

Last Updated : Jul 9, 2024, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details