ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గ్రీన్​జోన్​ ఎత్తివేయండి - సీఆర్డీఏ అధికారులను అడ్డుకున్న రైతులు - Farmers Stopped CRDA Survey - FARMERS STOPPED CRDA SURVEY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 1:12 PM IST

Farmers Stopped CRDA Survey in Amravati : రాజధానిలో సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం కోసం సర్వే చేసేందుకు వచ్చిన సీఆర్డీఏ (Capital Region Development Authority) అధికారులకు రైతులు షరతులు విధించారు. తమ భూములలో ప్రభుత్వం విధించిన గ్రీన్ జోన్ ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేశారు. సీడ్ యాక్సెస్ రహదారి వెంట ఉన్న తమ పొలాలకు ఎన్​ఓసీ (No Objection Certificate) పత్రాలు అందజేయాలని అధికారులను కోరారు. రైతుల అభ్యంతరాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని అధికారులు చెప్పారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చాకే భూములలో సర్వే చేయాలని రైతులు అధికారులకు తెల్చిచెప్పారు. దీంతో అధికారులు సర్వే చేయకుండానే వెనుదిరిగారు

ఇదిలా ఉండగా ఇంతకుముందే అమరావతి రాజధానిలోకి వెళ్లేందుకు ఉద్దేశించిన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు విస్తరణకు అడ్డంకులు తొలిగాయి. సమీకరణ విధానంలో ప్రభుత్వం భూములు తీసుకోనుంది. దీనికి రైతులు అంగీకరించారు. గతంలో టీడీపీ హయాంలో విశాలమైన రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చురుగ్గా సాగిన పనులు 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details