ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అల్లూరి జిల్లాలో బాలింతను భుజంపై మోసుకుని వాగు దాటిన ఆదివాసీలు - Pregnant Crossed Dam Dangerously

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2024, 8:08 PM IST

Family Members Crossed Dam Carrying Pregnant Woman on Shoulders: సరైన రోడ్లు లేక అల్లూరి జిల్లాలోని ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. గర్భిణీలు, బాలింతలు వర్షాకాలంలో ఆసుపత్రికి లేదా ఇంటికి వెళ్లాలంటే నానా తిప్పులు పడుతున్నారు. జిల్లాలో ఏర్పడ్డ ప్రమాదకరమైన చెక్ డాములు దాటుతూ ఉధృతంగా ప్రవహిస్తున్న చట్టం మీదుగా నడుస్తున్న తీరు భయాందోళన కల్పిస్తుంది. వివరాల్లోకి వెళ్తే అడ్డతీగల మండలం పింజర్ల కొండ గ్రామానికి చెందిన జ్యోతిక కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఆసుపత్రిలో బిడ్డను జన్మనిచ్చారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చే క్రమంలో భారీ వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చెక్‌డ్యాం పైనుంచి ప్రమాకర పరిస్థితుల్లో బాలింతను ఆమె కుటుంబసభ్యులు భుజంపై మోసుకుంటూ దాటారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామానికి చేరడానికి తప్పనిసరిగా ఈ ప్రమాదకర వాగును దాటాల్సి వస్తుందని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా రాజకీయ నేతలు, అధికారులు తమ సమస్య పట్ల స్పందించాలని తమ గ్రామానికి సరైన రోడ్లు వేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details