ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జూన్ మొదటి వారానికి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు : ప్రొఫెసర్​ చిన సత్యనారాయణ - Professor Chinna Satyanarayana - PROFESSOR CHINNA SATYANARAYANA

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 7:34 AM IST

F2F With Professor Dr. Chinna Satyanarayana on Southwest Monsoon : నైరుతి రుతుపవనాలు ఈ నెలఖారున కేరళను తాకే అవకాశం ఉంది. జూన్ మొదటి వారానికి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD -India Meteorological Department) అంచానా వేస్తోంది. ప్రస్తుతం దక్షిణ అంతర్గత తమిళనాడు పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుంది. మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ( మే 24న) నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. 

ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో  దాదాపు రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతు పవనాలు అండమాన్ కు చేరిన వేళ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కేఎల్​ యూనివర్సిటీ వాతావరణ ఆధ్యాయన విభాగం అసోసియేట్ ప్రోఫెసర్ డాక్టర్ జి. చిన సత్యనారాయణ సమాచారం అందించారు. ఈ ఏడాది వర్షం కురిసే రోజులు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఖరీఫ్​ సాగుకు వర్షాలు అనుకూలంగా ఉండవచ్చునని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details