ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శేషాచల అడవుల్లో గున్న ఏనుగు మృతి - తల్లి నుంచి విడిపోయినందుకేనా!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2024, 10:08 PM IST

Elephant_Died_in_Tirupati_District

Elephant Died in Tirupati District : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శేషాచల అటవీ ప్రాంతంలో ఏడాది వయసు ఉన్న గున్న ఏనుగు మృతి చెందింది. అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారులకు ఏనుగు కళేబరం కనపడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత 20 రోజులుగా సుమారు 18 ఏనుగుల గుంపు చిన్నరామాపురం పంచాయతీ పరిధిలో తిరుగుతున్నాయి. అక్కడి అటవీ సమీప గ్రామాలైన యల్లంపల్లి, కొండ్రెడ్డి కండ్రిగ, మాలపల్లి పరిసర ప్రాంతాల్లో పంట పొలాలపై ఈ గుంపు దాడులు చేస్తున్నాయని అధికారులు తెలిపారు.  

ప్రస్తుతం మృతి చెందిన గున్న ఏనుగు ఆ గుంపుకు చెందినదిగా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. తల్లి నుంచి విడిపోయి మనోవేదనకు గురై కానీ, అనారోగ్యంతో కానీ మృతి చెందినట్లు తెలుస్తుందని డి.ఎఫ్.ఓ (Divisional Forest Officer) సతీష్ తెలిపారు. ఏనుగు మృతి చెందిన ప్రాంతం వద్దకు సంబంధిత వైద్యులను అటవీశాఖ అధికారులు పిలిపించారు. ఏనుగు కళేబరం నుంచి ఆర్గాన్స్​ను సేకరించిన వైద్యులు, వాటిని ల్యాబ్​కు పంపించారు. గున్న ఏనుగుకి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details