ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వరద బాధితులకు 'ఈనాడు-మీతోడు' - గ్రామస్థుల కృతజ్ఞతలు - Eenadu Help to Flood Victims - EENADU HELP TO FLOOD VICTIMS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2024, 7:26 PM IST

Eenadu Help to Flood Victims in Krishna District :  కృష్ణా జిల్లా గన్నవరం వరద బాధితులకు ఈనాడు సంస్థ ఆపన్న హస్తం అందించింది. గన్నవరంతో పాటు ముస్తాబాద, ఎలుకపాడు గ్రామాల్లో వరద  బాధితులకు విజయవాడ ఈనాడు బృందం నిత్యావసర కిట్లను పంపిణీ చేసింది. ప్రత్యేక వాహనాల్లో బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కిట్లను అందజేశారు. కష్టకాలంలో ఆదుకున్న 'ఈనాడు'కు వరద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.  

ఓ వైపు ఎడతెరపిగా కురిసిన వర్షాలు, మరోవైపు బుడమేరు, ఏలూరు పంట కాలువలకు పడిన గండ్ల కారణంగా భారీ వరద ప్రవాహం గ్రామాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ వరదలు పొలాలను ముంచెత్తడంతో పాటు అనేక కుటుంబాలను కకావికలం చేయగా బాధిత కుటుంబాల సభ్యులు కట్టుబట్టలతో పునరావస కేంద్రాలకు వెళ్లారు. తిరిగి వచ్చి చూస్తే వాళ్ల ఇళ్లన్నీ చెల్లాచెదురు అయ్యాయని బాధితులు వాపోయారు. వరద ఉద్ధృతికి సర్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితులకు ఈనాడు అండగా నిలవడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details