ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సెల్ ఫోన్​ మాట్లాడుతూ ఓటు వేయవచ్చా? - Duvvada used phone at polling Booth

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 9:44 PM IST

Duvvada Srinivas Used Cell Phone in Polling Station at Tekkali : ఓటర్లెవరూ పోలింగ్‌ కేంద్రాలకు మొబైల్‌ ఫోన్లు తేవద్దని ఎన్ని సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన వైఎస్సార్సీపీ నేతలు మాత్రం వాటిని బేఖాతరు చేయడం లేదు. ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించి టెక్కలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ కేంద్రంలో సెల్ ఫోన్​ వాడటం వివాదస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు సాయంత్రం ఓటు హక్కును వినియోగించుకోవడానికి టెక్కలిలో ఉన్న పోలింగ్ బూత్​కు వచ్చారు. బూత్​లో సెల్ ఫోన్ ఉపయోగించటం నిషేధం ఉన్నప్పటికి లెక్కచేయకుండా అందరూ చూస్తుండగానే ఫోన్ వాడారు.

అంతేగాక సెల్ ఫోన్​లో మాట్లాడుతూనే తన ఓటు హక్కును వినియోగించటం వివాదస్పదంగా మారింది. అక్కడే ఉన్న ఎన్నికల సిబ్బంది దువ్వాడ శ్రీనివాస్​ను నిలువరించకుండా చూస్తూ ఉండిపోయారు. దీంతో దర్జాగా ఫోన్​లో మాట్లాడుతూనే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లను వినియోగించుకున్నారు. దీన్ని చూస్తున్న అక్కడి ఓటర్లు ఈసీ నిబంధనలు కేవలం సామాన్యులకేనా అంటూ ముక్కున వేలేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details