'కారుకు అడ్డొచ్చారనే కోపంతో దాడి- రాజకీయ పార్టీకి సంబంధం లేదు' - DSP Explanation of Couple Attack - DSP EXPLANATION OF COUPLE ATTACK
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2024, 1:06 PM IST
DSP Explanation of Couple Attack in Perupalem Beach : పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం బీచ్‌కు వెళ్లి వస్తున్న దంపతులపై జరిగిన దాడితో ఏ రాజకీయ పార్టీకీ సంబంధం లేదని నరసాపురం డీఎస్పీ గంటి శ్రీనివాసరావు తెలిపారు. దాడి సంఘటనపై ఆయన వివరాలు వెల్లడించారు. లక్ష్మణేశ్వరానికి చెందిన లక్ష్మీదుర్గ బంధువులతో కలిసి ఈ నెల 19న పేరుపాలెం బీచ్‌లో మేనల్లుడి జన్మదిన వేడుకకు హాజరయ్యారు. సిద్ధాంతానికి చెందిన బంధువులతో కలిసి వాళ్లు ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తుండగా కారుకు అడ్డుగా వచ్చారనే కోపంతో తూర్పుతాళ్లుకు చెందిన బల్ల బాబి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు.
ఆయన అనుచరులతో కలిసి లక్ష్మీదుర్గ దంపతులపై దాడికి పాల్పడ్డారు. మహిళలు అని చూడకుండా మొత్తం ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురిపై దాడి చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. బాధితులు నరసాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు మొగల్తూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు బాబిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా అతడిని రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ వెల్లడించారు.