ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మాచర్లలో నిలిచిన తాగునీరు - ట్యాంకర్​ వస్తే యుద్ధ వాతావరణమే! - Water problem - WATER PROBLEM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 5:29 PM IST

Drinking Water Problem in Palnadu District : పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో వారం రోజుల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్​ వస్తే నీటిని పట్టుకునేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు పోటీ పడుతున్నారు. నీటి కోసం స్థానికులు ట్యాంకర్లను చుట్టుముట్టడం వల్ల అక్కడ కొంత సమయం ఘర్షణ వాతావరణం నెలకొంటుందని స్థానికులు తెలిపారు. తాగునీటి సమస్యను తీర్చమని ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాచర్ల పట్టణంలో 30, 31 వార్డులకు కలిపి ఒకే బోరు వ్యవస్థ ఉందని స్థానికులు తెలిపారు. ఆ బోరు వారం రోజుల క్రితం చెడిపోవడంతో నీటి కోసం నానా అవస్థలు పడుతున్నామని పేర్కొన్నారు. తాగునీటి కోసం కూలీ పనులు కూాడా వెళ్లే కూడా ఎదురు చూడాల్సిన వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details