నా వివరణ తీసుకోకుండా అనర్హత వేటు- ఇది కక్ష పూరిత చర్యే: జంగా కృష్ణమూర్తి - MLC Janga Disqualification - MLC JANGA DISQUALIFICATION
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 16, 2024, 10:20 PM IST
Disqualification of MLC Janga Krishna Murthy: ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేశారన్నారు. ఇది బీసీ వర్గాలపై కక్ష సాధింపు చర్యేనన్నారు. పార్టీలు మారిన తెలుగుదేశం ఎమ్మెల్యేలపై సంవత్సరాలు తరబడి వేటు వేయకుండా తన పదవిపై మాత్రమే వేటు వేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కృష్ణమూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికలకు ముందు జగన్ తనను పొగుడుతూ మాట్లాడిన వీడియోను మీడియాకు వినిపించారు.
జగన్ గురజాల సభలో మాట్లాడుతూ తనకు అన్యాయం చేయనని చెప్పి ఇప్పుడు కనీసం మాట్లాడే అవకాశం లేకుండా అనర్హత వేటు వేశారన్నారు. బీసీ వర్గాలను ఎదగనీయకుండా చేయాలని వైసీపీ కక్ష సాధింపుతో వ్యవహరిస్తుందోని ఆయన మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థిగా అనిల్‌కుమార్ యాదవ్ వచ్చాక కులాల మధ్యలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామాల్లో సామరస్య వాతావరణం లేకుండా చేస్తున్నారని లేవనెత్తారు. రాష్ట్రానికి చంద్రబాబు అవసరం చాలా ఉందని రానున్న ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు విజయం సాధిస్తారని ఆయన అన్నారు.