ఉపముఖ్యమంత్రికి ఎదురైన నిరసన సెగ - సాగు భూములకు పట్టాలివ్వాలన్న గిరిజనులు - Rajannadora Faced Protests Tribals
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 10:10 PM IST
Deputy Chief Minister Rajannadora Faced Protests From Tribals : విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు గిరిజనుల నుంచి నిరసన సెగ ఎదురైంది. తమ ఆధీనంలో ఉన్న సాగు భూములకు పట్టాలివ్వాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు మంత్రిని నిలదీశారు. మండలంలో 14గ్రామాలకు చెందిన 339 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి హాజరయ్యారు. ఇళ్ల పట్టాల కార్యక్రమం పంపిణీ అనంతరం ఎంపీడీవో కార్యాలయం నుంచి బయటకు వచ్చిన మంత్రి రాజన్నదొరకు గిరిజనులు వినతి పత్రం అందించేందుకు గిరిజనులు, సీపీఎం నాయకులు ప్రయత్నించిగా ఆయన నిరాకరించారు.
గిరిజనుల తరపున సీపీఎం నాయకుడు రాకోటి రాము సమస్య వివరిస్తుండగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. గిరిజన శాఖ మంత్రి కూడా తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల కోసం గుర్తించిన భూములకు పట్టాలు ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పోలీసులు గిరిజనులు, సీపీఎం నాయకులకు ఇళ్ల పట్టాల విషయంలో సర్ధి చెప్పి నిరసన విరమింపచేశారు.