ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జాతీయ భద్రతకు ప్రాధాన్యమివ్వడమే మా విధానం: రాజ్​నాథ్​సింగ్ - విశాఖలో మిలన్ 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 10:39 PM IST

Defense Minister Rajnath Singh: మిత్రదేశాలతో సౌహార్ద్ర సంబంధాలు నెరపడం, అంతర్జాతీయ శాంతి పరిరక్షణ, సహకారంలో కీలకభాగస్వామిగా ఉండడం, జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వడం భారత్ విధానమని రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ అన్నారు. మిత్రదేశాలకు సహకారం అన్ని రకాలుగా ఇవ్వడంలో తాము ముందుంటామని పేర్కొన్నారు. అందుకోసం దేశ రక్షణలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. ఎటువంటి పరిస్ధితుల్లోనైనా ధీటుగా సమాధానం ఇస్తామని వెల్లడించారు. బహుళ దేశాల నౌకాదళాలు పాల్గొంటున్న మిలన్ 2024 ఉత్సవాన్ని రాజ్​నాథ్​ సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచంలో నేవీలలో మిత్రదేశాలలో సాంకేతిక, ఇతర నావికా పరిజ్ఞానాన్ని పంచుకునేందుకే ఈ ఉత్సవాలను రెండేళ్ల కొకసారి నిర్వహిస్తోందని తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి పరిరక్షణకోసం మిత్రదేశాల నేవీలతో నిరంతరం కలిసి పనిచేస్తామని వెల్లడించారు. 

ఏయేటికాయేడు మిలన్ ప్రాధాన్యం పెరుగుతూ రావడం దీనిపట్ల ఇతర దేశాలకు ఎంతో నమ్మకం ఉండడం ఒకటని భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్  అన్నారు. ఈసారి 50 దేశాలకు పైగా నేవీ బృందాలు వచ్చాయని తెలిపారు. మిలన్ ఉత్సవం కేవలం నౌకాదళ విన్యాసాలకే పరిమితం కాకుండా సాంస్కృతిక, భావసారూప్య సంబంధాలను పెంపొందించుకోవడానికి ఒక వేదికగా నిలుస్తోందన్నారు. వివిధ రకాల ఉత్పత్తుల స్టాళ్లతో తీర్చిదిద్దిన మిలన్ 2024 గ్రామాన్ని, వివిధ రక్షణ ఉత్పత్తుల సంస్ధలు ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనను రక్షణ మంత్రి ప్రారంభించి వాటిని పరిశీలించారు.  

ABOUT THE AUTHOR

...view details