ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: సీపీఎం నేత బాబురావు - మున్సిపల్ కార్మికుల డిమాండ్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 9:47 PM IST

CPM Leader Babu Rao Demand On Municipal Workers Wages: మున్సిపల్ కార్మికుల 16 రోజుల సమ్మె అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు మండిపడ్డారు. సమ్మె కాలానికి వేతనం, అండర్ గ్రౌండ్ కార్మికులకు 24 వేల వేతనం పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు  వెంటనే నెరవేర్చాలని బాబురావు డిమాండ్ చేశారు. 14వ తేదీ దాటినా రాష్ట్రంలో పారిశుద్ధ్య, ఇతర కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు అందలేదని బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Babu Rao Fired to Fulfill Promises of Municipal Workers: మున్సిపల్ కార్మికుల వేతనాలు తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేస్తూ సీహెచ్ బాబురావు మున్సిపల్ కార్మికులతో కలిసి విజయవాడలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ కార్మికుల సమ్మె ఒప్పందాల అమలుకు నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వకుండా జగన్ సర్కార్ కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. వేతనాలు చెల్లించకపోతే కార్మికులు భిక్షాటన తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే మరోసారి ఉద్యమం తప్పదని బాబురావు హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details