ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వేల కోట్ల లిక్కర్‌ స్కాంలో సీఎం జగన్‌పై ఎందుకు కేసు పెట్టలేదు?: సీపీఐ రామకృష్ణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 3:43 PM IST

CPI RamaKrishna Fire on CM Jagan : రాష్ట్రంలో వేల కోట్ల లిక్కర్ స్కాం జరిగితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకని సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టలేదని, కనీసం కేసు కూడా నమోదు చేయలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఒంగోలులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024లో ఎన్నికల్లో సీపీఐ కూడా పోటీ చేస్తుందని తెలిపారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

జగన్ స్వచ్ఛందంగా సభలు పెడితే పదిమంది కూడా రారు :  సీఎం జగన్ ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి చేయలేక పోయారని, కానీ ఓట్ల కోసం మూడు రాజధానులు పేరుతో ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్​గా పోటీ చేస్తామని చెప్పుకొంటున్న జగన్ రెడ్డి డబ్బులు, మద్యం బాటిళ్లు, బిర్యానీ పంచి ప్రజలను తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ స్వచ్ఛందంగా సభలు పెడితే పది మంది కూడా రారని అన్నారు. చాలా సార్లు బటన్ నొక్కడానికే సభలు పెట్టారని, ప్రజలకు ఒక్కసారి ఏమీ ఇవ్వకుండా సభ పెట్టితే ఎంత మంది వస్తారో తెలుస్తుంది అని సవాల్ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details